English | Telugu
ఈత రాకపోయినా నీళ్ళల్లో దూకేసిన ప్రముఖ హీరోయిన్
Updated : Jul 8, 2025
తమిళ చిత్రం 'జో' లోని సుచిత్ర అనే క్యారక్టర్ ద్వారా ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకున్న నటి 'మాళవిక మనోజ్'(Malavika Manoj).సుహాస్(Suhas)హీరోగా రామ్ గోదల(Ram Godhala)దర్సకత్వంలో తెరకెక్కిన 'ఓ భామ అయ్యో రామ'(O Bhama Ayyo Rama)అనే చిత్రం ద్వారా మాళవిక తొలిసారిగా తెలుగు తెరకి పరిచయం కాబోతుంది.
ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో మాళవిక మీడియాతో మాట్లాడుతు 'జో'లో నా నటన నచ్చి దర్శకుడు రామ్ నన్ను సంప్రదించారు. ఈ కథలో ప్రేమ, వినోదంతో పాటు చాలా కోణాలు ఉన్నాయి. స్కిప్ట్ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసాను. సత్యభామ అనే మోడరన్ అమ్మాయిగా, నా క్యారక్టర్ చాలా హైపర్ గా, గడుసుతనంతో ఉంటుంది. నా నిజ జీవితానికి మాత్రం ఈ క్యారక్టర్ చాలా దూరం. కానీ ఓన్ చేసుకొని నటించా. స్విమ్మింగ్ రాకపోయినా, ఒక సీన్ కోసమని నీళ్ళలోకి దూకి భయపడుతూనే స్విమ్ చేసాను.
ప్రతి నటి కూడా తన కెరీర్ లో ఈ మూవీలో నేనే చేసే క్యారక్టర్ లాంటి దాన్ని పోషించాలని అనుకుంటుంది. ఇలాంటి పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. కథ నచ్చి సౌకర్యంగా అనిపిస్తే గ్లామర్ పాత్రలు చేయడానికైనా సిద్ధమని మాళవిక మనోజ్ చెప్పుకొచ్చింది. ఓ భామ అయ్యో రామని 'వి' ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మించగా బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.