ఆగస్టు 22న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ!
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీంతో పాటు పలువురు విద్గ్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.