English | Telugu

హరిహరవీరమల్లు టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చేసింది

హరిహరవీరమల్లు టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చేసింది

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. 'బ్రో' మూవీ వచ్చిన రెండు సంవత్సరాలకి పవన్ నుంచి వీరమల్లు వస్తుండటం, పైగా పోరాటయోధుడుగా ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీ చెయ్యడంతో వీరమల్లులో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై అగ్ర నిర్మాత ఎ ఏం రత్నం(Am Rathnam)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.

రీసెంట్ గా  ఎఏం రత్నం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు హరిహర వీరమల్లు క్యారక్టర్ పూర్తిగా కల్పిత పాత్ర. కొంత మంది అనుకున్నట్టుగా నిజజీవిత కథ కాదు. 17 వ శతాబ్దంలో వీరమల్లు కథ జరుగుతుంది.  హరిహర అంటే శివుడు, విష్ణువు కలయిక. వీరమల్లు అంటే వీరుడు. అందుకే హరిహరవీరమల్లు అని టైటిల్ నిర్ణయించాం. ఇప్పటి వరకు సాగిన నా సినీ జర్నీలో 'వీరమల్లు' తోనే ఎక్కువ ప్రయాణం చేశాను. పవన్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వేంటనే పూర్తి చేసే సాధారణ చిత్రం కాదు. గ్రాఫిక్స్, సెట్స్ తో ముడిపడిన చారిత్రాత్మక సబ్జెక్టు. అందుకే చాలా లేట్ అవుతూ వచ్చింది. దీంతో చాలా మంది మూవీ ఎలా ఉండబోతుందో అనే అనుమానాన్ని వ్యక్తం చేసారు. ట్రైలర్ తో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. 

తొంబై శాతం విజయాల్ని చూసిన వాడిగా చెప్తున్నాను. వీరమల్లు ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. జాతీయ స్థాయిలో పవన్ గారి పేరు నిలబెడుతుంది. మా అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ చిత కథని సరికొత్తగా మలిచాడు. ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వెయ్యబోతున్నామని ఎ ఏం రత్నం చెప్పుకొచ్చాడు. వీరమల్లుకి మొదట క్రిష్(Krish)ఆ తర్వాత జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రి, అనసూయ, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ నెల 21 న హైదరాబాద్ లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 


    
 

హరిహరవీరమల్లు టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చేసింది