English | Telugu

అకీరా నందన్ సినిమా కోసమేనా ఇదంతా!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)గత చిత్రం 'హరిహరవీరమల్లు'(HariHara Veeramallu)జులై 24 న విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన వీరమల్లు ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం వీరమల్లు ప్రమోషన్స్ లో ప్రస్తావించడంతో పాటు, ఆర్ధిక పరమైన విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత 'టిజి విశ్వప్రసాద్'(TG Vishwa Prasad)సాయం చేసారని కూడా పవన్ ప్రస్తావించడం జరిగింది. దీంతో పవన్ కొడుకు 'అకిరానందన్' ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందనే విశ్వప్రసాద్ సాయం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.

రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'విశ్వప్రసాద్' మాట్లాడుతు అకిరాని ఇంట్రడ్యూస్ చెయ్యాలనే ఆశ ప్రతి నిర్మాతకి ఉంటుంది. నాకు కూడా ఆ అవకాశం రావాలని కోరుకోవడం సహజం. అంతే కానీ అకిరాని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందని వీరమల్లుకి నేను సాయం చెయ్యలేదు. ఆ సమయంలో ఏఎంరత్నం గారికి నా అవసరం ఉందనిపించి చేశాను. కాకపోతే ఎవరితో చెయ్యాలనే నిర్ణయాన్ని అకిరానే నిర్ణయించుకుంటాడు. నాకైతే చిరంజీవి, పవన్, అకిరా తో సినిమాలు నిర్మించాలని ఉందని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు.

2015 లో w/ o ఆఫ్ రామ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన విశ్వ ప్రసాద్ అనతి కాలంలోనే వరుస చిత్రాలు నిర్మిస్తు అగ్ర నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'ది రాజాసాబ్'(The Raja Saab), తేజ సజ్జ(Teja Sajja)తో 'మిరాయ్'(Mirai)వంటి భారీ చిత్రాలని నిర్మిస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటు విడుదలకి సిద్ధం కానున్నాయి. పవన్ కళ్యాణ్, విశ్వప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే 'బ్రో' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.