English | Telugu

మూడేళ్లుగా పరారీలో ఉన్న ప్రముఖ నటి ఆచూకీ లభ్యం.. అరెస్టుకి ఆదేశించిన కోర్టు

సూర్య(Suriya)కీర్తిసురేష్(Kirthi Suresh)జంటగా నటించిన తమిళ చిత్రం 'థానా సెర్ధా కూటమ్'.క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కగా, 2018 లో విడుదలైంది. నయనతార' భర్త 'విగ్నేష్ శివన్'(Vignesh Shivan)దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సూర్య ఫ్రెండ్ క్యారక్టర్ కి వైఫ్ గా నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన నటి 'మీరా మిథున్‌'(Meera Mithun). ఈ నటి  2021, ఆగష్టు 7న సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు ఒక దర్శకుడు నా ఫోటోని దొంగిలించి తన సినిమా ఫస్ట్‌లుక్ కోసం వాడుకున్నాడు. తమిళ చిత్ర సీమలో షెడ్యూల్ కులాలకి చెందిన వ్యక్తులందరినీ తొలగించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసు కేసు నమోదైంది.   

రెండు కాలాల్లోను బాలయ్య టాప్! 

'గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ'(Balakrishna)వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ  కోవలోనే మరో బ్లాక్ బస్టర్ ని అందుకునేందుకు 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)దర్శకత్వంలో 'అఖండ పార్ట్  2'(Akhanda 2)ని సిద్ధం చేస్తున్నాడు. డెవోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అఖండ కి సీక్వెల్ కావడంతో, ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయదశమి(Vijayadasami)కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Tejaswini),14 రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ  త్వరలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకోనుంది.