English | Telugu
ఎన్టీఆర్ దేవర పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు.. పార్ట్ 2 లో ఆ హీరో ఉన్నాడా!
Updated : Aug 2, 2025
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda),గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'నాగవంశీ'(Naga Vamsi) నిర్మించిన భారీ చిత్రం 'కింగ్డమ్'(KIngdom). స్పై యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా, జులై 31 న వరల్డ్ వైడ్ గా విడులైంది. రీసెంట్ గా కింగ్డమ్ మేకర్స్ మీడియాతో ముచ్చటించడం జరిగింది.
ఈ సందర్భంగా విజయ దేవరకొండ మాట్లాడుతు 'కింగ్డమ్' కి మొదట 'నాగదేవర'(Nagadevara)అనే టైటిల్ అనుకున్నాం. కానీ 'ఎన్టీఆర్(Ntr)'దేవర'(Devara)కోసం ఆ టైటిల్ వదులుకున్నాం. గౌతమ్ కింగ్డమ్ స్టోరీ చెప్పగానే రిఫరెన్స్ కోసం 'వైకింగ్స్', 'ది లాస్ట్ కింగ్డమ్' వంటి చిత్రాలు వరుసగా చూసాను. కింగ్డమ్ లో కానిస్టేబుల్ గా కనిపించే సన్నివేశాల్లో సన్నగా కనిపిస్తాను. ఫ్యామిలీ స్టార్ కంటే ముందు ఆ సన్నివేశాలని చిత్రీకరించారు. ఆ తర్వాత స్పై, పోరాటయోధుడుగా కనిపించడానికి ఆరునెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను. కింగ్డమ్ పార్ట్ 2 లో స్టార్ హీరో ఖచ్చితంగా ఉంటాడు. సోషల్ మీడియాలో ఆ హీరో 'రానా' అంటు జరుగుతున్న చర్చల్లో నిజం లేదు. ఎవరనేది గౌతమ్ చెప్తాడు. తెలుగుతో పాటు తమిళంలోను కింగ్డమ్ కి మంచి ఆదరణ దక్కుతుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
కింగ్ డమ్ లో విజయ్ సరసన 'భాగ్యశ్రీ బోర్సే'(Bhaghyashri Borse)జత కట్టగా సత్యదేవ్(Sathyadev)కౌశిక్ మెహతా కీలక పాత్రల్లో కనిపించగా అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander)సంగీతాన్ని అందించాడు. మొదటి రోజు కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటించింది.