English | Telugu
జూన్ లో రభస ఆడియో
Updated : May 7, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రభస". గతకొద్ది రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నారు. సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అలనాటి సూపర్ హిట్ సాంగ్ "అత్తమడుగు వాగులోనా..." పాటను ఇందులో రీమేక్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.