English | Telugu
మెగా అభిమానులకి షాక్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య
Updated : Nov 3, 2023
సాధారణంగా వెండి తెర మీద రికార్డు కలెక్షన్ లని సృష్టించిన సినిమా బుల్లి తెర మీద వస్తుంటే జనం ఇరగబడి మరి చూస్తారు. అదే పెద్ద హీరో సినిమా అయితే ఇక చెప్పక్కర్లేదు ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులు మానుకొని సినిమా టెలికాస్ట్ అయ్యే టైంకి టివిల ముందు వాలిపోతారు. అలాగే ఆ హీరో అభిమానులు తమ హీరో సినిమా టీవీ లో సాధించిన రేటింగ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మొన్న విజయదశమికి మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద ప్రీమియర్ షో గా ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కి వచ్చిన టిఆర్పీ రేటింగ్ సంచలనం సృష్టిస్తుంది.
విజయదశమి కానుకగా వాల్తేరు వీరయ్య ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యింది. మెగా స్టార్ సినిమా టీవీ ల్లో వస్తుంటే మెగా అభిమానులతో పాటు సినిమా అభిమానులు,సాధారణ ప్రజలందరూ టీవీలకి అతుక్కొనిపోయి మరి చూస్తారు. పైగా వాల్తేరు వీరయ్య లాంటి హిట్ మూవీ కాబట్టి టెలివిజన్ చరిత్రలోనే చిరంజీవి సినిమా రికార్డు టిఆర్పి రేటింగ్ ని సాధించడం ఖాయమని మెగా అభిమానులతో పాటు సినీ ట్రేడ్ సర్కిల్స్ కూడా భావించాయి. కానీ అందరు షాక్ అయ్యేలా వాల్తేరు వీరయ్య కి 5 .14 రేటింగ్ వచ్చింది.
మెగా స్టార్ చిరంజీవి హీరో గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవి తేజ చిరంజీవి తమ్ముడుగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సాధించింది. అంతే కాకుండా మెగాస్టార్ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా వాల్తేరు వీరయ్య నిలిచింది. అలాంటి సినిమాకి ఇప్పుడు బుల్లి తెర మీద తక్కువ టిఆర్పీ రేటింగ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది