English | Telugu
పవన్ లక్కుతో స్విస్ బ్యాంక్ కి దారేది
Updated : Oct 30, 2013
తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిత్రం "అత్తారింటికి దారేది". పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే పవన్ సినిమాలోని డైలాగులను,పాటలను, టైటిల్స్ లను ఇప్పటివరకు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పెట్టేసుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి కన్నడ నటుడు ఉపేంద్ర చేరిపోయాడు.
కన్నడంలో ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం "టోపీవాలా". ఎం.జి.శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన భావన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని ఇపుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి "స్విస్ బ్యాంక్ కి దారేది" అనే టైటిల్ ను ఖరారు చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి ఇప్పటి వరకు పవన్ పేరును వాడుకున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాయి. మరి ఏకంగా పవన్ బ్లాక్ బస్టర్ చిత్ర టైటిల్ నే మర్చి పెట్టుకున్న ఉపేంద్రకి లక్కు కలిసొస్తుందో లేదో త్వరలోనే చూడాలి.