English | Telugu
హిందీ రిపోర్టర్ కు పవన్ ప్రేమతో..
Updated : Mar 22, 2016
సర్దార్ హిందీ ప్రమోషన్లలో భాగంగా, పవన్ దైనిక్ జాగరణ్ ఎడిటర్ అజయ్ బ్రహ్మాత్మజ్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే అజయ్ తన ట్విట్టర్లో పవన్ గిఫ్ట్ ఇచ్చాడు త్వరలోనే చూపిస్తాను అని ట్వీట్ చేయడంతో, ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటాడోనన్న ఆసక్తి పవన్ అభిమానులకు కలిగింది. లేటెస్ట్ గా ఆ ఫోటోను తన ట్విట్టర్లో పెట్టాడు అజయ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పవన్ ప్రేమతో అంటూ సంతకం పెట్టాడు. మీరు నాకిచ్చిన విలువైన టైం కు కృతజ్ఞతలు. తన ఫ్యాన్స్ కోసం ఒకే పేజీలో పవన్ మూడు భాషల్లో ప్రేమతో సంతకం చేశారు అంటూ ట్వీట్ చేస్తూ ఈ ఫోటోను పెట్టారు అజయ్. ఎంతో రిజర్వుడ్ గా ఉండే పవన్ కళ్యాణ్, తన సినిమా సర్దార్ కోసం ఇలా దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం.