English | Telugu
మహేష్ బాబుకు విలన్ గా తయారైన సూర్య
Updated : Mar 22, 2016
ప్రస్తుతం బ్రహ్మోత్సవంతో ఫుల్ బిజీగా ఉన్న మహేష్, ఆ వెంటనే మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాకు షిఫ్ట్ అవుతాడు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ఆ సినిమాకు విలన్ గా రెండు భాషలకూ తెలిసిన వ్యక్తిని తీసుకోవాలనుకున్నాడు మురుగదాస్. అందుకే అతని దృష్టి సూర్య పై పడింది. సూర్య అంటే హీరో సూర్య కాదులెండి. పవన్ కళ్యాణ్ తో ఖుషీ తీసిన దర్శకుడు ఎస్.జే. సూర్య. ఈయన మహేష్ తో కూడా నాని అనే సినిమా తీశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన నాని, ఇక్కడ మాత్రం దెబ్బేసింది.
వ్యాపారి లాంటి సినిమాలతో నటుడిగా కూడా మన దగ్గర ఎస్.జే.సూర్య ఫేస్ బాగా ఫ్యామస్. అందుకే అతన్నే తమ సినిమాలో విలన్ గా తీసుకోవాలనుకుంటున్నాడట మురుగ. తెలుగులో ఎలాగూ మహేష్ మానియా వర్కవుట్ అయితే, తమిళ వాళ్లకు సూర్య ఫేస్ సుపరిచితం కాబట్టి అక్కడ కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్ గా తయారవుతుందనేది ఆయన ప్లాన్. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతీ చోప్రాను తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. బ్రహ్మోత్సవం పూర్తవ్వగానే, ఈ మొత్తం సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. మొత్తమ్మీద మహేష్ కెరీర్లో అత్యంత క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ ఇదే అనడంలో మాత్రం డౌట్ లేదు.