English | Telugu

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

-పేరు ఏంటో తెలుసా!
-ఖచ్చితంగా ఆ నటుడే
-ఫస్ట్ సినిమా ఎవరితో


'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.


బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఎన్టీఆర్(Ntr)రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్(Allu Arjun),రవితేజ(Raviteja) వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ 2015 లో వచ్చిన టెంపర్ తర్వాత ఏ మూవీని నిర్మించలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా BG బ్లాక్ బస్టర్స్(BG Blockbustersఅనే సరికొత్త బ్యానర్ ని ఏర్పాటు చేసాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటిస్తు లోగోని విడుదల చేసాడు. ఈ బ్యానర్ ద్వారా హృదయాలను తాకే కథలు, ఎమోషనల్ స్టోరీలు, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తానని ఎక్స్ వేదికగా తెలిపాడు. BG అంటే Bandla ganesh అనే అర్ధం తెలిసిందే.


Also read: జననయగాన్ రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు


కొంత కాలం నుంచి చాలా ఇంటర్వూస్ లో బండ్ల గణేష్ మాట్లాడుతు మళ్ళీ సినిమాలు నిర్మించి తన సత్తా చాటుతానని చెప్తూ వస్తున్నాడు. దీంతో చెప్పిన మాట ప్రకారం సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. కాకపోతే బ్యానర్ పేరు మార్చడం చర్చినీయాంశ మయ్యింది. ఏది ఏమైనా అభిమానులతో పాటు ప్రేక్షకులు గణేష్ రీ ఎంట్రీ కి సోషల్ మీడియా వేదికగా వెల్ కమ్ చెప్తున్నారు. మరి ఫస్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.