English | Telugu

చిట్టీల రాణి అరెస్టు

బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి రూ.10 కోట్ల వరకు నొక్కేసి పారిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నుండి బెంగుళూరుకి మకాం మార్చేసిన ఈ అమ్మడిని పోలీసులు బెంగుళూరులో పట్టుకున్నారు. ఈమెతో సహ 10 మంది బంధువులని పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెకి ఎక్కడెక్కడ, ఎంత మొత్తంలో ఆస్తులున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలతో ఆమెని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం వుంది.