English | Telugu

‘కింగ్డమ్‌’ చూసిన యు.ఎస్‌. ఆడియన్స్‌ ఏమంటున్నారంటే..?

విజయ్‌ దేవరకొండ అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కింగ్డమ్‌’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందే యు.ఎస్‌.లో ప్రీమియర్స్‌ పడ్డాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే విజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌తోపాటు టెక్నికల్‌ వేల్యూస్‌, మంచి కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉందని ఓవరాల్‌ రిపోర్ట్‌ వస్తోంది. సినిమాలో అన్నదమ్ముల అనుబంధం గురించి వచ్చే సీన్స్‌ ఎంగేజింగ్‌గా ఉన్నాయని, అలాగే హీరోయిన్‌తో హీరో చేసే రొమాంటిక్ట్రాక్‌ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. సత్యదేవ్‌, భాగ్యశ్రీ ఎంతో బాగా చేశారని అప్రిషియేట్‌ చేస్తున్నారు.

డైరెక్టర్‌ గౌతమ్‌ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేసిన తీరు బాగుందని చెబుతున్నారు. సినిమా స్టార్టింగ్‌లో టైటిల్‌ కార్డ్‌ చాలా వేశారని, ఒక అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో సినిమా స్టార్ట్‌ అయి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేసిందని చెబుతున్నారు. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్‌ని కథలో ఇన్‌వాల్వ్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడని అంటున్నారు. సూరి పాత్రలో విజయ్‌ దేవరకొండ అద్భుతమైన పెరఫార్మన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ టెక్నికల్‌ ఎస్సెట్స్‌. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఫస్ట్‌హాఫ్‌ ఆడియన్స్‌ని బాగా ఎంగేజ్‌ చేసేలా ఉంది అంటున్నారు.

సెకండాఫ్‌ని కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌ డ్రైవ్‌ చేశారని, ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌, జైలులో జరిగే ఎమోషనల్‌ సీన్స్‌ బాగా వచ్చాయంటున్నారు. కథ ప్రకారం వచ్చే సీన్స్‌ను డైరెక్టర్‌ ఎంతో కాలిక్యులేటెడ్‌గా బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్లారని, అదే సమయంలో ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో డైరెక్టర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారని ప్రశంసిస్తున్నారు. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ అంటున్నారు. యుఎస్‌ ఆడియన్స్‌ వ్యక్తపరుస్తున్న ఈ అభిప్రాయాలతో ఇక్కడి ఆడియన్స్‌ ఎంతవరకు ఏకీభవిస్తారనేది చూడాలి.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.