English | Telugu

కింగ్‌డమ్ టార్గెట్ ఇదే.. విజయ్ హిట్ కొడతాడా..?

విజయ్ దేవరకొండ హిట్ కొట్టి దాదాపు ఏడేళ్లు అయింది. 2018లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ ఖాతాలో హిట్ పడలేదు. విజయ్ హీరోగా నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజా చిత్రం 'కింగ్‌డమ్' సంచలన బిజినెస్ చేసింది. (Kingdom)

విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'కింగ్‌డమ్'. రేపు(జూలై 31) విడుదలవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ.. 'కింగ్‌డమ్' భారీ థియేట్రికల్ బిజినెస్ చేసింది.

నైజాంలో రూ.15 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ లో రూ.6 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ.36 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.7 కోట్లు, ఓవర్సీస్ రూ.9.5 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.52.5 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.53 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

విజయ్ కెరీర్ లో రూ.50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మూడో సినిమాగా 'కింగ్‌డమ్' నిలిచింది. గతంలో 'లైగర్' రూ.80 కోట్లకు పైగా బిజినెస్ చేయగా, 'ఖుషి' రూ.50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అయితే ఆ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించలేదు. దీంతో ఇప్పుడు 'కింగ్‌డమ్'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్. బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.