English | Telugu

ద్రోహి మూవీ రివ్యూ


నటీనటులు : సందీప్‌ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్‌, మజిలీ శివ, మహేష్‌ విట్ట, డెబ్బి తదితరులు
సంగీతం : అనంత నారాయణ ఎ.జి.
నిర్మాణం: ప్లే వరల్డ్‌ క్రియేషన్స్‌, సాఫిరస్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్స్‌, గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా
నిర్మాతలు: రాజశేఖర్‌ రవిపూడి, శ్రీకాంత్‌రెడ్డి దుగ్గెంపూడి.
దర్శకుడు: విజయ్‌దాస్‌ పెందుర్తి
విడుదల తేదీ: 03.11.2023

కథ :

అజయ్‌(సందీప్‌) ఒక బిజినెస్‌ మాన్‌. తన ఇద్దరు స్నేహితులతో కలిసి బిజినెస్‌ చేస్తుంటాడు. అతను ఏ బిజినెస్‌ చేసినా అది ఫెయిల్‌ అవుతూ ఉంటుంది. బిజినెస్‌లో పదే పదే ఫెయిల్‌ అవుతున్నా సందీప్‌ భార్య చంద్రిక(దీప్తివర్మ) అతనికి అన్నివిధాలుగా సపోర్టుగా ఉంటుంది. రెండేళ్లుగా చేస్తున్న వ్యాపారాల్లో సక్సెస్‌ సాధించకపోవడంతో అజయ్‌ బాగా డిస్ట్రబ్‌ అయిపోతాడు, ఫుల్‌ ప్రెజర్‌ ఫీల్‌ అవుతూ ఉంటాడు. అలా సాగిపోతున్న అతని జీవితంలో జరిగిన అనుకోని ఘటన అతన్ని మరింత కృంగదీస్తుంది. సడన్‌గా అతని భార్య చంద్రిక చనిపోతుంది. అయితే చంద్రిక భర్తే చంపాడన్న ఆరోపణతో అజయ్‌ను అరెస్ట్‌ చేస్తారు. అయితే చేయని నేరానికి అరెస్ట్‌ అయిన అజయ్‌ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :

దర్శకుడు ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్‌ అయింది. కథ, కథకి తగిన స్క్రీన్‌ప్లేను సమకూర్చుకొని ఆద్యంతం సినిమాను ఆసక్తికరంగా మలిచాడు. ఇప్పటివరకు కమెడియన్‌గానే కనిపించిన షకలక శంకర్‌ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. అతని క్యారెక్టర్‌ని కూడా బాగా డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. ఇందులో ఒక లీడ్‌ రోల్‌ చేసిన హీరోయిన్‌ డెబ్బి ఇంతకుముందు సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే సాఫ్ట్‌ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. అనంత నారాయణ సంగీతం సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయిందని చెప్పాలి. హీరో సందీప్‌ తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి చేశాడు. అతని క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా బాగుంది. హీరో ఫ్రెండ్స్‌ క్యారెక్టర్స్‌లో నటించిన మహేష్‌ విట్ట, నీరోజ్‌ పుచ్చ తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. వారి క్యారెక్టర్లు కూడా సినిమాలో బాగున్నాయి. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీస్‌ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

ఇది పేరుకి చిన్న సినిమాయే అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా గ్రాండ్‌గా తీశారు. హీరోకి ఇది మొదటి సినిమాయే అయినప్పటికీ బాగా చేశాడు.
షకలక శంకర్‌ క్యారెక్టర్‌, నటన అద్భుతంగా ఉన్నాయి.

మైనస్‌ పాయింట్స్‌ :

రొటీన్‌ కథ, మ్యూజిక్‌.

రేటింగ్‌ : 2.5/5