English | Telugu
Rathika Sister Comments On Rahul: రచ్చగా మారిన రాహుల్ సిప్లిగంజ్ రతికల ప్రేమ వ్యవహారం
Updated : Nov 4, 2023
రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బిగ్‌బాస్ సీజన్ 7కి ఓ స్పెషాలిటీ వుంది. ఈ సీజన్‌కి అన్నీ ప్రత్యేకతలే ఉన్నాయి. ఒక్కో వారం ఒక్కో సంచలనం చోటు చేసుకుంటోంది. ఇప్పుడు అన్నింటినీ మించి సోషల్ మీడియాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల మధ్య ఓ కొత్త గొడవ మొదలైంది. అయితే ఇది ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న రతిక, ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
అసలు విషయానికి వస్తే... బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి నాలుగోవారంలోనే ఎలిమినేట్ అయింది రతిక. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి మళ్లీ పంపారు బిగ్‌బాస్. ఆమె ఎలిమినేట్ కావడానికి పల్లవి ప్రశాంత్ మరియు యావర్‌తో జరిపిన ప్రేమాయణం, గొడవలు ఒక కారణమైతే.. రతిక మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా మరో కారణం. వీళ్లిద్దరు గతంలో రిలేషన్‌లో ఉన్నప్పుడు దిగిన ప్రైవేటు ఫొటోలు రతిక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దాంతో వీళ్లిద్దరూ మాజీ లవర్సా అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాహుల్ పరోక్షంగా స్పందిస్తూ.. కొన్నేళ్ల క్రితం దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయంటే.. తన ఫేమ్‌ని యూజ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో రతిక కావాలనే ఈ ఫొటోలను లీక్ చేసిందని రాహుల్ ఫ్యాన్స్ అతన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. రాహుల్ బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ కావడం, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండడం.. ఇవన్నీ రతిక మీద బాగానే ప్రభావం చూపాయి.
ఆ ఫొటోలు బయటికి రావడం వెనుక రతిక హస్తం లేదని, కావాలనే రాహుల్ ఆ ఫోటోలను లీక్ చేసి వుండొచ్చని ఆరోపిస్తోంది రతిక చెల్లెలు. అసలు వాళ్ళిద్దరికీ బ్రేకప్ ఎందుకయ్యింది, రాహుల్‌ని పెళ్ళి చేసుకోవడానికి రతికకు ఎలాంటి కండీషన్స్ పెట్టాడు అనే విషయాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో రతిక చెల్లెలు వెల్లడిరచింది.
‘రతిక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్‌తో మా అక్క దిగిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. తనని యూజ్ చేసుకోవడానికి మా అక్కే అలా చేసిందని రాహుల్ ఆరోపిస్తున్నాడు. అయితే ఖచ్చితంగా ఆ ఫోటోలను రాహులే లీక్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు మా అక్క దగ్గర, రాహుల్ దగ్గర మాత్రమే ఉంటాయి. మరొకరి దగ్గర ఉండే అవకాశమే లేదు. అక్క బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. మొబైల్ కూడా లేదు. మరి ఫోటోలు ఎలా లీక్ చేస్తుంది. తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసుకొని బ్యాడ్ అవ్వాలని ఏ అమ్మాయీ అనుకోదు. రాహుల్, రతిక ప్రేమించుకున్నది, పెళ్ళిచేసుకోవాలనుకున్నది నిజం. మా డాడీకి చెబితే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఫైనల్‌గా రాహుల్, రతికల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పెళ్ళి జరిగితే రతిక ఇండస్ట్రీలో ఉండకూడదని, బయటకు వెళ్లడానికి వీల్లేదని కండీషన్స్ పెట్టాడు. అవి రతికకు నచ్చకపోవడంతో ఇద్దరి అంగీకారంతోనే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఆ టాపిక్ లేదు. ఎవరి పనిలో వారు ఉన్నారు. కానీ, ఇన్నాళ్ళకు రతిక బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అలా స్టోరీ ఎందుకు పెట్టాడో అర్థం కావడం లేదు. ఆ ఫొటోలు బయటకు వచ్చిన తర్వాత రాహుల్‌ని మేం ఏమీ అడగలేదు. ఎందుకంటే అతనికి కూడా ఫ్యామిలీ ఉంది. అందుకే దాన్ని పెద్ద ఇష్యూ చేయదల్చుకోలేదు. ఫొటోలు లీక్ అయిన తర్వాత రాహుల్ స్టోరీ పెట్టడం వల్ల జనంలో కొత్త సందేహాలను కలిగించినట్టయింది’ అంటూ వివరించింది రతిక చెల్లెలు.