English | Telugu
'జై భీమ్' కూడా డిజప్పాయింట్ చేసింది!
Updated : Feb 8, 2022
సూర్య నటించగా, ఎంతోమంది ప్రశంసలు పొందిన తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా 'జై భీమ్', ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించగా జాతీయ అవార్డు పొందిన మలయాళం చిత్రం 'మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' మంగళవారం (ఫిబ్రవరి 8) ప్రకటించిన 94వ అకాడమీ అవార్డుల నామినేషన్ల జాబితాలో చోటు సంపాదించలేకపోయాయి. 2022 ఆస్కార్ అవార్డుల పోటీలో నామినేషన్ల పరిశీలకు అర్హత సాధించిన 276 చిత్రాల్లో ఈ రెండు చిత్రాలూ ఉన్న విషయం తెలిసిందే.
'జై భీమ్' సినిమాకు ఈసారి ఆస్కార్స్‌లో ఫైనల్ నామినేషన్ పొందే సత్తా ఉందంటూ అంచనాలు వెల్లువెత్తాయి. జనవరిలో 'సీన్ ఎట్ ది అకాడమీ' సెక్షన్ కింద ఆస్కార్స్ యూట్యూబ్ చానల్‌లో 'జై భీమ్'లోని ఓ సన్నివేశాన్ని చూపించడం దీనికి కారణం. ఆ వీడియోలో సినిమాలోని ఓపెనింగ్ సీన్ గురించి దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ వివరించడం కూడా అందులో చూపించారు. Also read:మరో ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే!?
కాగా, 2022 ఆస్కార్స్‌కు భారత అధికారిక ఎంట్రీగా వెళ్లింది పి.ఎస్. వినోద్‌రాజ్ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం 'కూళంగళ్'. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని, ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇంతదాకా దేశంలో అధికారికంగా విడుదల కాలేదు. అయితే మనదేశానికి చెందిన 'రైటింగ్ విత్ ఫైర్' అనే డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో నామినేషన్ పొందడం గుడ్ న్యూస్. మార్చి 27న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. Also read:మణిశర్మ సంగీతప్రస్థానానికి 30 వసంతాలు!
బెస్ట్ పిక్చర్ కోసం పోటీలో బెల్‌ఫాస్ట్, కోడా, డోన్ట్ లుక్ అప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజ్జా, నైట్‌మేర్ అల్లీ, ద పవర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ మూవీస్ నామినేషన్లు సంపాదించాయి.