English | Telugu

సునీల్ పేరు మారనుందా...?

"తడాఖా" చిత్రం విజయం తరువాత సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భీమవరం బుల్లోడు". ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సునీల్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈ చిత్ర టైటిల్ ను మార్చబోతున్నారని తెలిసింది. ఆంధ్ర, తెలంగాణా వాళ్ళు ఏమైనా గొడవ చేసే ప్రమాదం ఉందని గ్రహించారు ఈ చిత్ర యూనిట్. అందుకే ఈ చిత్రానికి "దసరా బుల్లోడు" అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి ఈ చిత్ర టైటిల్ విషయం పై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తీ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.