English | Telugu

సమంతను ఓదార్చిన హీరోయిన్

టాలీవుడ్ లో సమంతకు చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే అలాంటి అభిమాన ప్రేక్షకులకు విరుద్దంగా సమంత తన ట్విట్టర్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. "రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటే జనాలు బాగా ఎక్కువై చుట్టూ చేరిపోతున్నారు. దాంతో చాలా విసుగుగా ఉంటోంది. జూలో ఒక జంతువులగా ఉన్నట్లు.. ఒక మాదిరిగా చూస్తున్నారు అనిపిస్తుంది అని పేర్కొంది.

అయితే దీనికి ఛార్మి స్పందిస్తూ... ఏం చేస్తాం.. తప్పదు కదా మరి. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా లొకేషన్ లో మేకప్ వ్యాన్ పెట్టుకోవడానికి కూడా ఖాళీ ప్లేస్ లేదు. కానీ తప్పదు కాబట్టి షూటింగ్ చేస్తున్నాను అని స్పందించింది.