English | Telugu

సునీల్ కు గీతాంజలి హిట్టు దక్కుతుందా...?

"గీతాంజలి" సినిమాలో నాగార్జున క్యాన్సర్ పేషంట్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే అదే తరహాలో సునీల్ కూడా ఓ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిసింది. "మర్యాద రామన్న" చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా మారిపోయిన సునీల్ ప్రస్తుతం "భీమవరం బుల్లోడు" చిత్రంలో నటిస్తున్నాడు. ఉదయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ క్యాన్సర్ పేషెంట్‌గా కనిపించ‌బోతున్నట్లు తెలిసింది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తుంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.