English | Telugu
దీపావళి కోసం సిద్ధమవుతున్న న్యూఇయర్
Updated : Jan 3, 2014
"చెన్నై ఎక్స్ ప్రెస్" తర్వాత షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటిస్తున్న తాజా చిత్రం "హ్యాపీ న్యూ ఇయర్". ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, సోనుసూద్, బోమన్ ఇరానీ, వివాన్ షా లాంటి వారు నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా ఇందులో క్లబ్ డ్యాన్సర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా న్యూ ఇయర్ సందర్భంగా ప్రచార చిత్రాలను నేరుగా వివిధ సోషల్ నెట్ వర్క్ ల ద్వారా అభిమానులకు నేరుగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు.