English | Telugu

వాళ్ళకు ఓ దారి చూపనున్నదర్శకుడు

ప్రస్తుతం ఉన్న దర్శకులకు దాదాపు సొంత బ్యానర్ అంటూ ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి దర్శకుడు సుకుమార్ కూడా చేరాడు. ప్రస్తుతం మహేష్ తో కలిసి "1-నేనొక్కడినే" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అయితే తన దగ్గర పనిచేసే ప్రతిభావంతులైన సహాయ దర్శకులతో వరుసగా సినిమాలు తీసే ఉద్దేశంతో "సుకుమార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ " పేరుతో సుకుమార్ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ..."నాకు మొదటి నుంచి చిన్న సినిమాలు అంటే చాలా ఆసక్తి. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉండే చిన్న సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నాకు తీరిక లేకపోవడం వల్ల అలాంటి చిత్రాలు చేయలేని పరిస్థితి. అందుకే నా దగ్గర పనిచేసే సహాయ దర్శకులను ప్రోత్సహిస్తూ వరుసగా సినిమాలు నిర్మించబోతున్నా" అని తెలియజేసారు.