English | Telugu
ఆస్కార్ కు ఎన్. శంకర్ ఎంపిక
Updated : Sep 4, 2013
ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కార వేడుకలకు భారతీయ సినిమాలు కూడా పోటీ పడే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రాలను ఆస్కార్ వేడుకలకు ప్రతిపాదించేందుకు ప్రతి సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. మొత్తం 17 మంది ఉండే ఈ కమిటి సభ్యులలో తెలుగు నుంచి ఈ సంవత్సరం ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఎంపిక అయ్యారు. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాదులో జరగనున్న ఈ ప్రక్రియలో శంకర్ పాల్గొననున్నారు. ఈయనతో పాటు నిర్మాత సివి రెడ్డి కూడా ఒక సభ్యునిగా ఎంపికయ్యారు.