English | Telugu
సమస్య మీద పోరాడే శ్రీకాంత్ దుశ్శాసన
Updated : Apr 5, 2011
ఈ "దుశ్శాసన" చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో పోసాని దర్శకత్వంలో తాను "ఆపరేషన్ దుర్యోధన" చిత్రంలో నటించాననీ, ఆ చిత్రం లానే ఈ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందనీ అన్నారు. ఈ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రంలో శ్రీకాంత్ చేగువెరా గెటప్ లో కనిపించటం విశేషం. ఈ చిత్ర నిర్మాత మురళీ కృష్ణ ప్రసంగిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందనీ, అందుకే శ్రీకాంత్ "దుశ్శాసన" పేరు ముద్రించిన పేపర్ గ్లాసులు ఓ పదిలక్షలు తయారుచేసి పంపిణీ చేస్తున్నామనీ, తమ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని అన్నారు.