English | Telugu

సూర్యకు తల్లిగా సిమ్రాన్

తన అందంతో దాదాపు ఓ దశాబ్ధంపాటు తెలుగు, తమిళ భాషల్ని ఊపి పారేసిన సిమ్రాన్ ఇప్పుడు తల్లి పాత్రలకు స్వాగతం పలుకుతోంది. సూర్య, త్రిష జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో సూర్యకు తల్లిగా.. త్రిషకు అత్తగా నటించేందుకు ఆమె అంగీకరించింది.

అంతకుముందు ఆమె.. "సూర్య సన్నాఫ్ కృష్ణన్" అనే చిత్రంలో సూర్యకు జంటగా. సూర్యకు తల్లిగా నటించింది. ఆ చిత్రంలో తండ్రీకొడుకులుగా సూర్య నటించగా.. తండ్రి పాత్రకు జంటగా సిమ్రాన్ నటించింది. తన కెరీర్ మంచి ఊపు మీదుండగానే.. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక.. బుల్లితెరపై సందడి చేస్తున్న సిమ్రాన్.. తల్లి పాత్రలకు పచ్చజెండా ఊపడంతో.. తెలుగులోనూ ఆమెకు ఆ తరహా ఆఫర్లు వెల్లువెత్తుతుండడం ఖాయం.

పైగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితోనూ సిమ్రాన్ నటించి ఉండడంతో... వారి వారసులకు తల్లిగా నటించడం ప్రేక్షకుల్ని అలరిస్తుంది!