English | Telugu

బైక్ నుండి పడిపోయిన శ్రద్దా

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం "ఏక్ విలన్" అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో భాగంగా బైక్ రైడ్ సన్నివేశంలో పాల్గొన్నది. సన్నివేశంలో భాగంగా హీరో సిద్దార్థ్ మల్హోత్రా బైక్ ను శ్రద్దా వెంబడించాలి. అయితే వీరిద్దరూ వారి వారి బైక్ ల మీద కూర్చొని షాట్ కి రెడీ అయ్యారు. డైరెక్టర్ "స్టార్ట్ కెమెరా..." అని అనగానే యాక్సిలేటర్ వేగం పెంచింది. ఆ వేగాన్ని అదుపుచేయలేక శ్రద్ధా బైక్ స్కిడ్ అయ్యి పడిపోయింది. తలకు హెల్మెట్ పెట్టుకోవడం వాళ్ళ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. కానీ చిన్న చిన్న గాయాలయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స చేసారు. కానీ ఓ గంట తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొని ఆ సన్నివేశాన్ని విజయవంతంగా పూర్తి చేసారు.