English | Telugu

'షేర్' ఫస్ట్‌లుక్ - కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్


విజయలక్ష్మీ పిక్టర్స్ పతాకం పై నిర్మితమవుతున్న షేర్ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలయ్యింది. జూలై 5న కళ్యాణ్ రాం పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు. 'కత్తి' చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లికార్జున్‌ దర్శకత్వంలో సాయి నిహారిక సమర్పణలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ చిత్రం టైటిల్ రోల్ పోషిస్తున్నారు. టైటిల్ తగట్టుగానే ఈ చిత్రం పూర్తి తరహాయాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కళ్యాణ్ రామ్ అభిమానులు షేర్ ఫస్ట్ లుక్ చూసి సంబరపడిపోతున్నారు.