English | Telugu

ఏప్రెల్ 1 న యన్ టి ఆర్ శక్తి విడుదల

తెలుగువన్ డాట్ కామ్ ముందుగా చెప్పినట్లుగానే యన్ టి ఆర్ "శక్తి" ఏప్రెల్ 30 న కాకుండా ఏప్రెల్ 1 న విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము అందాల గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" ఫేం మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం"శక్తి". ఈ "శక్తి" చిత్రానికి మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రెల్ 30 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ఈ చిత్రం ఏప్రెల్ 1 వ తేదీన విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మార్చ్ 30 వ తేదీన ఉండటం వల్ల, అదికూడా చిరకాల ప్రత్యర్థి, మన దాయాది అయిన పాకిస్తాన్ తో భారత్ ఆ మ్యాచ్ లో ఆడబోతున్నందువల్లా దేశం యావత్తూ ఆ మ్యాచ్ మీదే దృష్టి సారిస్తుందనీ, అందుకే ఈ యన్ టి ఆర్ శక్తి విడుదల ఏప్రెల్ 30 న కాకుండా ఏప్రెల్ ఒకటిన ఆల్ ఫూల్స్ డే రోజున విడుదల చేయనున్నారట. అవును మరి పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ అంటేనే జనానికి ఇంట్రెస్ట్. అందులోనూ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఇక చెప్పేదేముంది. ఆ రోజు ఆదిశక్తి దర్శనమిస్తానన్నా జనం చూడరు. ఇక యన్ టి ఆర్ "శక్తి"ని ఇంకెక్కడ చూస్తారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.