English | Telugu

యన్ టి ఆర్ శక్తి కి ఎ సర్టిఫికేట్

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr picturesయన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న "శక్తి" చిత్రానికి సెన్సారులో "ఎ" సర్టిఫికేట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము అందాల గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" ఫేం మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం"శక్తి". ఈ "శక్తి" చిత్రానికి మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.

ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి సెన్సారు వారు "ఎ" సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి సెన్సారు వారు ఒక్క కట్ కూడా చెప్పకుండా ఇలా "ఎ" సర్టికెట్ ఇవ్వటం విశేషం. ఈ చిత్రంలో ఇంకా సోనూ సూద్, పూజాబేడీ, జాకీ ష్రాఫ్, మంజరీ ఫడ్నీస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం శక్తి పీఠాలకు సంబంధిమచిన కథతో నిర్మించబడింది. ఈ చిత్రం తెలుగు వన్ అంచనా ప్రకారమే మార్చ్ 30 వ తేదీన కాకుండా ఏప్రెల్ ఒకటవ తేదీన విడుదల కానుంది.