English | Telugu
బేబీ డైరెక్టర్ కోసం చేయికోసుకున్నాను..సంచలనం సృష్టించడానికి పిచ్చోళ్లమా ఏంటి!
Updated : May 5, 2025
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలయికలో తెరకెక్కిన 'బేబీ'(Baby)మూవీ సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ మూవీ ద్వారా దర్శకుడిగా కీర్తిని గడించిన వ్యక్తి సాయిరాజేష్(sai Rajesh)తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరాడు. బేబీని హిందీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాజ్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్(Babil Khan)తో సాయిరాజేష్ రీమేక్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఇర్ఫాజ్ ప్లేస్ లో వేరే వాళ్ళని చూస్తున్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
రీసెంట్ గా బాబిల్ ఖాన్ ఒక వీడియో చేసాడు. అందులో ఆయన కన్నీటి పర్యంతంతో మాట్లాడుతు 'బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్క్ చెయ్యడానికి అనువైన ప్లేస్ కాదు. ఒక ఫేక్ పరిశ్రమ.కాకపోతే కొంత మంది మంచి నటులు, నటీమణులు ఉన్నారని వీడియో చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడ. ఆ వీడియోపై విమర్శలు రావడంతో వెంటనే డిలీట్ చేసాడు. ఇప్పుడు ఈ విషయంపై సాయి రాజేష్ ఇనిస్టా వేదికగా స్పందిస్తు 'మీరేం మాట్లాడిన మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా. వీడియోలో అతను ప్రస్తావించిన వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళైతే, ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చి వాళ్లమా. ఒక గంట ముందు వరకు అతనికి సపోర్ట్ గా నిలవాలనుకున్నాను. కాకపోతే వీడియో చూసిన తర్వాత ఆగిపోవడం మంచిదనిపించింది. సానుభూతి ఆటలు చెల్లవు. మీరు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చిందని పోస్ట్ చేసాడు.
సాయిరాజేష్ చేసిన ఈ పోస్ట్ కి భాబిల్ ఖాన్ స్పందిస్తు మీరు నా హృదయాన్ని ముక్కలు చేసారు. మీకోసం రెండేళ్ల నా జీవితాన్ని దారపోశాను. ఒళ్ళు హూనం చేసుకుని నా పాత్రకి తగట్టుగా నన్ను మలుచుకోవడానికి మురికి గుంటలో దొర్లాను. నా చెయ్యి కూడా కోసుకున్నానని కామెంట్స్ చేసాడు. అయితే ఆ తర్వాత తన కామెంట్స్ ని డిలీట్ చెయ్యగా, సాయి రాజేష్ కూడా తన పోస్ట్ ని డిలీట్ చేసాడు.
