English | Telugu

వంద కోట్ల క్లబ్ లో హిట్-3.. నాని రేర్ ఫీట్!

వంద కోట్ల క్లబ్ లో హిట్-3.. నాని రేర్ ఫీట్!

 

ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని టైం నడుస్తుందని చెప్పవచ్చు. ఈ ఏడాది మార్చిలో ఆయన నిర్మించిన 'కోర్ట్' విడుదలై రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు నాని నటిస్తూ నిర్మించిన 'హిట్-3' వంద కోట్ల క్లబ్ లో చేరింది. (Hit 3 Collections)

 

మే 1న థియేటర్లలో అడుగుపెట్టిన  'హిట్-3'.. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అదే జోరుని కొనసాగిస్తూ రెండో రోజు రూ.19 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.20 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.19 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో నాలుగో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్ల గ్రాస్ సాధించింది. 

 

నాని కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా 'హిట్-3' నిలిచింది. గతంలో నాని నటించిన 'దసరా', 'సరిపోదా శనివారం' ఈ ఫీట్ సాధించాయి. టైర్-2 స్టార్స్ లో మూడు వంద కోట్ల గ్రాస్ సినిమాలున్న హీరో నానినే కావడం విశేషం.

 

 

వంద కోట్ల క్లబ్ లో హిట్-3.. నాని రేర్ ఫీట్!