Read more!

English | Telugu

పవన్ ' సర్దార్ ' బాలీవుడ్లో రిలీజవ్వకూడదట

పబ్లిసిటీ కోసం పాకులాడే మన వర్మ గారు, తాను ఫ్యామస్ అవటానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరు. నేషనల్ వైడ్ ఇష్యూల మీద, స్టార్ హీరోల ఫ్యాన్స్ సెంటిమెంట్స్ మీద ఆయన తన పబ్లిసిటి బిల్డింగ్ ను కట్టుకుంటుంటారు. ఈ మధ్య పవన్ ను వదిలి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మీద పడ్డాడులే అని అందరూ అనుకుంటుండగానే మళ్లీ వర్మ గాలి పవన్ వైపు మళ్లింది. పవన్ సర్దార్ హిందీలో రిలీజవ్వకూడదంటున్నాడు వర్మ. పైగా సర్దార్ కు, బాహుబలికి కంపేరిజన్స్ పెడుతూ పోలుస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య చిచ్చు పెట్టడం మనోడి టార్గెట్ లా కనబడుతోంది.

పవన్ తో కనీసం ఒక్కరు తెలివైన వాళ్లున్నా, వాళ్లు పవన్ ఈ తప్పు చేయనివ్వరు. బాహుబలి అంత పెద్ద సినిమాతోనే పవన్ బాలీవుడ్ లోకి రావాలి. లేదంటే బాక్సాఫీస్ వద్ద సర్దార్ చాలా చిన్న సినిమాగా కనిపిస్తుంది. హిందీలో సర్దార్ గనుక ఫెయిల్ అయితే, నేషనల్ వైడ్ గా పవన్ కళ్యాణ్ కంటే ప్రభాసే ఎక్కువ అని ప్రూవ్ అవుతుంది. ఇది పవన్ కు చాలా బ్యాడ్. బాహుబలి లాంటి విజువల్ వండర్స్ లేకుండా సర్దార్ ను హిందీలో రిలీజ్ చేయడం బ్లండర్ మిస్టేక్.

ఇవీ వర్మ పవన్ గురించి, సర్దార్ గురించి చేసిన ట్వీట్లు. అసలు వర్మ వ్యాఖ్యలు చేసేముందు కనీసం ఆలోచించడేమో అనిపిస్తుంది ఇలాంటి ట్వీట్స్ చూస్తుంటే. రజనీకాంత్ బాలీవుడ్లో కూడా సూపర్ స్టార్ అండ్ ఫ్యామస్ హీరో. కానీ ఆయన సినిమాలేవీ కూడా కోలీవుడ్ ఆడినంత అద్భుతంగా అక్కడ ఆడవు. అంత మాత్రం చేత ఆయన చిన్న హీరో అయిపోతాడా..? వర్మ గారూ..పబ్లిసిటీ మాత్రమే కాదు. గౌరవమూ ముఖ్యమే..కాస్త ఆలోచించండి మరి.