English | Telugu

ఫ్యాన్స్ కు దెబ్బ తగిలితే వాళ్లకంటే నాకే బాధ - పవన్ కళ్యాణ్

రేపు జరగబోయే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మాటల్లో : " రిలీజయ్యే సినిమా గురించి మాట్లాడటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఆడియో ఫంక్షన్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఫ్యాన్స్ లో ఎవరికైతే పాస్ లు ఉన్నాయో వాళ్లు మాత్రమే ఆడియో వెన్యూ కు రండి. దయచేసి పాస్ లు లేనివాళ్లు రావద్దు. పోలీసులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఫారిన్ డెలిగేట్స్ ఇదే హోటల్లో ఉన్న కారణంగా, సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ పాస్ లు లేకపోతే రావద్దు అని నా రిక్వెస్ట్" అని పవన్ చెప్పారు. మీ అభిమానులు అర్ధం చేసుకుంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్," వాళ్లకు దెబ్బలు తగిలితే వాళ్లకంటే నాకే ఎక్కువ బాధ. నేను చెప్పేది వాళ్లు అర్ధం చేసుకుంటారు. ఫర్లేదు" అన్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.