English | Telugu

మెగాస్టార్, మాస్ మ‌హారాజా.. నాలుగోసారి?

మెగాస్టార్, మాస్ మ‌హారాజా.. నాలుగోసారి?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఆరాధించే క‌థానాయ‌కుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. త‌న కెరీర్ ఆరంభంలో చిరు న‌టించిన హిందీ చిత్రం `ఆజ్ కా గుండారాజ్` (1992)లో న‌లుగురు స్నేహితుల్లో ఒక‌రిగా క‌నిపించారు ర‌వితేజ‌. ఆపై దాదాపు ఎనిమిదేళ్ళ త‌రువాత `అన్న‌య్య‌` (2000)లో చిరు ఇద్ద‌రు త‌మ్ముళ్ళ‌లో ఒక‌రిగా ద‌ర్శ‌న‌మిచ్చారు. అలాగే `శంక‌ర్ దాదా జిందాబాద్` (2007) కోసం ఓ పాట‌లో త‌ళుక్కున మెరిశారు మాస్ మ‌హారాజా. క‌ట్ చేస్తే.. 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం నాలుగోసారి చిరుతో క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట ర‌వితేజ‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో మ‌రో హీరోకి కూడా స్థాన‌ముంద‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడా పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. మ‌రి..`అన్న‌య్య‌`లాగే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.

కాగా, ద‌స‌రాకి పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ద్వితీయార్ధంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.