English | Telugu
జూన్ లో రవితేజ పవర్
Updated : Apr 11, 2014
రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఇటీవలే చెన్నై హార్బర్ లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పది రోజులపాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం కోల్ కతాలో కొత్త షెడ్యులు జరుగుతుంది. ఇందులో రవితేజ, రెజీనాలపై ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాదు, బ్యాంకాక్ లలో షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.