English | Telugu

ఏప్రెల్ 9 న రానా, జెనీలియాతో పరుచూరి కిరీటి మూవీ

ఏప్రెల్ 9 న రానా హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించే సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. గతంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో "సింహా" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించబోతున్నారు. దర్శకుడిగా ప్రకాష్ తోలేటికిదే మొదటి చిత్రం కావటం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రెల్ తొమ్మిదవ తేదీన, హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఘనంగా ప్రారంభం కానుందని ఈ చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి మీడియాకు తెలిపారు.

ఏప్రెల్ 9 న రానా హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించే సినిమాలో రానా పాత్ర చాలా ఉత్కంఠ కలిగించేలా ఉంటుందనీ, హీరోయిన్ గా నటిస్తున్న జెనీలియా పాత్ర కూడా ఈ చిత్ర కథాగమనానికి తోడ్పడుతుందనీ ఈ చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. మార్చ్ 30 వ తేదీన ఈ యువ నిర్మాత పరుచూరి కిరిటి జన్మదినం సందర్భంగా అతనికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తను నిర్మించబోతున్న ఈ చిత్రం "సింహా" కన్నా పెద్ద హిట్ కావాలని ఆశిస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.