English | Telugu
మహేష్ పై తారక్ సెటైర్ వేసినట్లేనా
Updated : Oct 8, 2013
మహేష్ నటించిన "దూకుడు" చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో "యమదొంగ" సినిమాలోని ఎన్టీఆర్ చెప్పిన పులి డైలాగ్ ను ఎమ్మెస్ నారాయణ చేత చెప్పించి, "దూకుడు" చిత్ర విజయంలో ఒక కారణం అయ్యింది. అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కామెడి సీన్స్ ట్రైలర్స్ రీలిజ్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ మహేష్ పై చిన్న సెటైర్ వేసాడు. ఈ సీన్ లో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... రేపేమో వాళ్ళింట్లో నువ్ కాలు పెట్టు" అని మహేష్ సినిమాను కామెడీగా వాడుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.
ఈ విధంగా ఈ ఇద్దరు పెద్ద హీరోలు ఒకరి సినిమాలో మరొకరు కావాలని సెటైర్లు వేసుకోకపోయినా కూడా అభిమానుల్లో మాత్రం మహేష్-తారక్ ల మధ్య గట్టి పోటియే ఉందని అనుకుంటున్నారు. మరి ఎన్‌టిఆర్ హీరోగా నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్రం అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.తమన్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు.