English | Telugu

తారక్ అభిమానులకు శుభవార్త

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగకు మరి కొద్దిరోజులు మాత్రమే ఉంది. రామయ్యా రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు రెండు దసరా పండగలను తీసుకొస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఅర్. ఎన్‌టిఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ A సర్టిఫికేట్ ను ఇచ్చారు.అక్టోబర్ 10వ తేదీన విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.తమన్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ కి అధ్బుతమైన స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రదర్శించబోయే థియేటర్ల వద్ద సందడి మొదలయ్యింది. అభిమానులు తమ అభిమాన హీరో తారక్ "రామయ్యా వస్తావయ్యా" సినిమా విజయం సాధించాలని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కటౌట్ లు, పోస్టర్ లతో తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఈ చిత్రం తారక్ కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.