English | Telugu

న్యూలుక్ లో రామ్

"ఒంగోలు గిత్త" చిత్రం తర్వాత రామ్ నటిస్తున్న తాజా చిత్రం "మసాలా". వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ చిత్రంలో రామ్ కొత్తగా కనిపించబోతున్నాడట. అందుకే ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో ను లీక్ అవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే తాజాగా రామ్ హెయిర్ స్టైల్ ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఈ ఫోటోలో రామ్ పసుపు, తెలుపు రంగుల కలయికలో ఉన్న హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. మరి ఈ స్టిల్ "మసాలా" సినిమాలోనిదా? లేక రామ్ కొత్త చిత్రంకు సంబంధించినదా అనే విషయం త్వరలోనే తెలియనుంది.