English | Telugu
పోటుగాడు పాటలు విడుదల
Updated : Aug 26, 2013
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "పోటుగాడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం విడుదల చేశారు. పవన్ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలో మనోజ్ సరసన సాక్షిచౌదరి, సిమ్రాన్ కౌర్, రేచల్, అను హీరోయిన్లుగా నటించారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, మోహన్ బాబు, లక్ష్మీప్రసన్న,ఛార్మి, జయసుధ,నాగచైతన్య, సునీల్, నాని, నరేష్, శర్వానంద్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అందరూ కోరుకున్నారు.