English | Telugu

వికారాబాద్ అడవిలో రామ్ చరణ్ "రచ్చ"

యువ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో నిర్మించబడుతున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి శ్రీలంక దేశంలోనూ, ఇటీవల చైనా దేశంలోనూ జరిగింది. ప్రస్తుతం ఈ "రచ్చ" చిత్రం స్కెడ్యూల్ డిసెంబర్ 10 వ తేదీనుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు, ఛేజింగ్ దృశ్యాలను వికారాబాద్ అడవిలో చిత్రీకరించనున్నారు.

"ఆరెంజ్" వంటి ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం" రచ్చ". అన్నట్టు ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే రామ్ చరణ్ నిశ్చితార్థం ఉపాసనతో జరిగింది. పెద్దలు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కనుక ఆమె అతని జీవితంలో అడుగుపెట్టిన వేళ ఎలా ఉందో ఈ చిత్రం విజయం మనకు తెలియజేస్తుంది.