English | Telugu
నాగచైతన్య హీరోగా పూరీ చిత్రం మార్చ్ లో
Updated : Dec 6, 2011
నాగచైతన్య హీరోగా పూరీ చిత్రం మార్చ్ లో ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, నటిస్తుండగా దర్శకుడు పూరీ జగన్నాథ్ "బిజినెస్ మ్యాన్" చిత్రం పూర్తిచేయటంలో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, యువ హీరో నాగచైతన్య హీరోగా నటించబోయే చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం 2012 మార్చ్ 25 వ తేదీన ప్రారంభం కాబోతూందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. నాగార్జునతో "శివమణి", "సూపర్" చిత్రాలను తీసిన పూరీ జగన్నాథ్ నాగచైతన్యను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి.