English | Telugu

యన్ టి ఆర్ "దమ్ము" ఎంతవరకొచ్చింది...!

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యువ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "దమ్ము". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ ఇటీవల కేరళలోని పొల్లాచ్చికి వెళ్ళింది. అక్కడి నుండి రాగానే మైసూర్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మైసూర్ స్కెడ్యూల్ ఆలస్యమయ్యింది.

ఈ చిత్రంలో యన్ టి ఆర్ కి తల్లిగా సీనియర్ హీరోయిన్ భానుప్రియ నటిస్తున్నారు. బోయపాటి శీని "సింహా" చిత్రం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దమ్ము". బోయపాటి శీను బాబాయ్ బాలకృష్ణకి "సింహా" ఎంత పెద్ద హిట్టిచ్చాడో అబ్బాయ్ యన్ టి ఆర్ కి "దమ్ము" రూపంలో అంతకంటే పెద్ద హిట్టివ్వనున్నాడని వారి అభిమానులు భావిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.