English | Telugu
అప్పుడు బాహుబలికి ఇప్పడు రజినీకీ - నో నో
Updated : Jul 3, 2014
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాను రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ గ్రామస్థులు అడ్డుకున్నట్లు సమాచారం. 'లింగా' చిత్ర షూటింగ్ కోసం యూనిట్ అక్కడకు వెళ్లగా వారిని గ్రామస్తులు అపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. షూటింగ్ నిర్వహింటడం వలన చెరువులో రసాయనాలు కలుస్తున్నాయని ఆ గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. చెరువు కలుషితమవుతున్న విషయాన్ని అధికారులకు తెలియచేస్తామంటున్నారు. అయితే చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ జరుపుకునేందుకు పర్మీషన్ తీసుకున్నట్లు తెలుపుతున్నారు. గతంలో బాహుబలి చిత్ర షూటింగ్ సమయంలో అనాజ్ పూర్ గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
లింగా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, అనుష్క, సోనాక్షి కథానాయికలుగా నటిస్తున్నారు. దాదాపు 15 రోజులుగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.