English | Telugu

బారిస్టర్ శంకర్ గా వస్తున్న జూ.చిరు

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే కానీ ఆయన పోలికలతో చాలా మంది ఉన్నారు. కానీ టాలీవుడ్ లో జూనియర్ చిరంజీవిగా పేరొందిన నటుడు రాజ్ కుమార్ గతకొద్ది కాలంగా సినిమాలకు స్వస్తి చెప్పి సీరియల్స్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ అయన వెండితెరపై కనిపించనున్నాడు.

ప్రస్తుతం ఆయన హీరోగా "బారిస్టర్ శంకర్ నారాయణ్" అనే చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇంతకాలం తర్వాత నటిస్తున్న ఈ జూనియర్ చిరంజీవికి ఒక హీరోయిన్ కూడా దొరికింది. దాంతో ఆ సినిమాలోని ఓ పాటకు మెగాస్టార్ లా ఫోజులు కొడుతూ, ఆంటీ లాంటి హీరోయిన్ తో రొమాన్స్ చేసేస్తున్నాడు. మరి ఈ అంకుల్ కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.