English | Telugu
అదే డైలాగ్స్... అదే మ్యూజిక్
Updated : Jun 19, 2013
సింహం సింహం ఇజ్ నరసింహం.... అంటూ సూర్య హీరోగా వచ్చిన "యముడు" చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ గా తెలుగులో "సింగం" అనే చిత్రం వస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్, ఫోటోలు విడుదలయ్యింది. అయితే వీటిని చూసిన సూర్య అభిమానులకు అంతగా కొత్తగా ఏం అనిపించట్లేదంట.
ఈ ట్రైలర్స్ లో అదే ఫోటోలు, అదే గెటప్, అదే టైపులో డైలాగ్స్ ఉండటం, అదే విధంగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ మాత్రం మార్చకుండా అలాగే మళ్ళీ చేసినట్లుగా అనిపించేసరికి జనాలకు అంతగా నచ్చట్లేదు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కాస్త నిరాశగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి "యముడు" చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం హిట్టవుతుందో లేక ఫట్టవుతుందో త్వరలోనే చూడాలి.