English | Telugu

మీడియాకి రచ్చరవి సంచలన లేఖ.. ఆ పార్టీతో సంబంధం లేదు!

ప్రముఖ సినీ గాయని 'మంగ్లీ' (Mangli) బర్త్ డే పార్టీ నిన్న రాత్రి హైదరాబాద్ (Hyderabad) శివారులోని ఒక రిసార్ట్ లో జరిగింది. గంజాయి, విదేశీ మద్యం దొరికిన ఈ పార్టీలో కొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సినీ నటుడు రచ్చ రవి ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడనే న్యూస్ కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తుంది.

ఈ నేపథ్యంలో రచ్చరవి (Racha Ravi) ఒక నోట్ రిలీజ్ చేస్తు 'మంగ్లీ పుట్టినరోజు వేడుకలకి నేను వెళ్లినట్టుగా కొన్ని మీడియా ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి. కానీ నేను ఆ పార్టీకి హాజరు కాలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా, నేను నా షూటింగ్ షెడ్యూల్‌లో చాలా బిజీగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలవడానికి కూడా సమయం లేదు.అలాంటిది నా పేరు ప్రసారం కావడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. నా పేరుని ప్రస్తావించే ముందు దయచేసి వాస్తవాలను ధృవీకరించాలని మీడియా నిపుణులను కోరుతున్నానని తన నోట్ లో పేర్కొన్నాడు.