English | Telugu
తొలిరోజే ఆన్‌లైన్‌లో లీకైన 'పుష్ప' హెచ్‌డీ వెర్షన్!
Updated : Dec 17, 2021
అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజయ్యింది. కూలివాడి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగిన పుష్పరాజ్ కథతో డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని రూపొందించాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సమంత, బన్నీపై చిత్రీకరించిన "ఊ అంటావా మావ" అనే ఐటమ్ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. సునీల్ మెయిన్ విలన్‌గా నటించిన 'పుష్ప'లో మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ చివరలో మెరుపులా మెరిశాడు.
Also read:'పుష్ప' మూవీ రివ్యూ
యమ క్రేజ్ తీసుకొచ్చి, బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన 'పుష్ప'కు సంబంధించి ఒక బాధాకరమైన వార్త ఏమంటే.. విడుదలైన మొదటిరోజే ఈ సినిమా ఫుల్ హెచ్‌డి వెర్షన్ ఆన్‌లైన్‌లో లీకవడం. పైరసీ బారిన పడిన లేటెస్ట్ ఫిల్మ్‌గా బన్నీ 'పుష్ప' నిలిచింది. తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్ లాంటి పైరసీ బేస్డ్ వెబ్‌సైట్స్‌లో 'పుష్ప' ప్రత్యక్షమయ్యింది. దేశంలోని బాక్సాఫీస్ కలెక్షన్‌పై దీని ప్రభావం ఉండనుందని భయపడుతున్నారు.
Also read:సమంత సాంగ్ కాంట్రవర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్!
'పుష్ప: ది రైజ్' తెలుగు సహా నాలుగు భాషల్లో నేడు విడుదలైంది. కాగా మలయాళం వెర్షన్ ఒకరోజు ఆలస్యంగా విడుదల కానుంది. కారణం.. ఆ వెర్షన్ కంటెంట్ సకాలంలో డెలివర్ కాకపోవడమే. మూవీలో పుష్పరాజుగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అదరహో అని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఏదేమైనా, విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో సినిమా లీకవడం ఇదే మొదటిసారి కాదు. నిన్న థియేటర్లలో రిలీజ్ కావడానికంటే ముందే 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. అలాగే మనీ హీస్ట్ సీజన్ 5, తడప్, కురుప్, అణ్ణాత్తే, సూర్యవంశీ, బెల్ బాటమ్, షేర్‌షా, ద ఫ్యామిలీ మ్యాన్ 2 సైతం పైరసీకి గురయ్యాయి.