English | Telugu
కొడుకు ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన బన్నీ!
Updated : Dec 17, 2021
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు(డిసెంబర్ 17 న) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మాస్ పార్టీ పేరుతో థియేటర్స్ దగ్గర బన్నీ ఫ్యాన్స్ తగ్గదేలే అంటూ హడావిడి చేస్తున్నారు. బన్నీ కూడా తనెంతో ఇష్టంగా కష్టపడి చేసిన పుష్ప మూవీ రిలీజ్ డేని స్పెషల్ గా ఫీల్ అవుతున్నాడు. ఇక ఈ స్పెషల్ డేని బన్నీకి మరింత స్పెషల్ గా మార్చాడు బన్నీ తనయుడు అయాన్.
Also read:'పుష్ప' మూవీ రివ్యూ
పుష్ప విడుదల సందర్భంగా ఈ ఉదయం అయాన్ తను డిజైన్ చేసిన ఒక కార్డుతో బన్నీని సర్ ప్రైజ్ చేశాడు. ఆ కార్డులో గొడ్డలి పట్టుకొని ఉన్న పుష్ప బొమ్మ పెన్సిల్ తో గీసి ఉంది. అలాగే, పుష్ప రిలీజ్ డేట్(17-12-2021)తో పాటు.. 'అల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్' అని రాసి ఉంది. తనయుడు తనకోసం గీసిన ఆర్ట్ చూసి బన్నీ మురిసిపోయాడు. ఆ కార్డు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. "థ్యాంక్యూ చిన్ని బాబు.. లవ్యూ అయాన్.. ఈ కార్డుతో ఈ ఉదయాన్ని మరింత స్పెషల్ గా మార్చావు" అని రాసుకొచ్చాడు.
Also read:మార్నింగ్ షోస్‌కు 'పుష్ప' ఆక్యుపెన్సీ ఇదే!
కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.